తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యత స్వీకరించిన ముత్తినేని వీరయ్యను కోదాడకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా అభినందించారు. వీరయ్య భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాక్షించారు. వికలాంగుల కార్పొరేషన్ ను అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్, పత్తిపాక జనార్ధన్, పాయల కోటేశ్వరరావు, 108 సైదులు ఉన్నారు.