సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ప్రకటించడం పట్ల ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి
కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం కోదాడలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా చేస్తున్న పోరాటం కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, రవి ఉన్నారు.