బానిస సంకెళ్లను కూకటి వేళ్ళతో పెకలించి, కుల మత భావాలను పటాపంచలు చేసిన అపర భగీరథుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని నడిగూడెం ఎస్ఐ అజయ్ అన్నారు. సోమవారం ఆ మహనీయుని జయంతి సందర్భంగా నడిగూడెం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.