

ఇంట్లోకి చొరబడిన యువకుడు.. చితకబాదిన బాలికలు (వీడియో)
యూపీలో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి ఇద్దరు బాలికలు బుద్ధి చెప్పారు. హర్దోయ్‌లో తార్దియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్‌రాయ్ గ్రామంలో మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు ఇద్దరు బాలికలు ఉన్న ఇంట్లోకి చొరబడి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ అక్కాచెల్లెళ్లు అతన్ని దారుణంగా కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది