వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఐ (పోలెండ్) తుమ్మేపల్లి రఘు రాధిక ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పులిహోర మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ అన్నారు. దాతలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి, కృతజ్ఞతలు తెలిపారు. వాసవి క్లబ్ కోదాడ సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్న తీరును ప్రశంసించారు.