కవితక్క యువసేన ఆధ్వర్యంలో కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి జన్మదిన వేడుకలను తన నివాసంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.