సేవే పరమ వాదిగా స్టార్ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు చేపడుతుందని క్లబ్ కోదాడ అధ్యక్షులు వంగవీటి. నాగరాజు అన్నారు. గురువారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రవిచంద్రన్ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా కోదాడ లో స్వాతి హాస్పిటల్ నందు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ భాస్కర్, కోశాధికారి ప్రసాద్, ఐఇసి వెంకట గురుమూర్తి, గీత, గరేణి శ్రీనివాసరావు, జగినీ ప్రసాద్ ఉన్నారు.