అనంతగిరి మండలం పాలవరం లో ఆదివారం సూర్యాస్తమ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికి వరకు ఉక్కగా ఉన్న వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం ధాటికి కోసి ఉన్న వరి మెదలు తడిచిపోయాయి. వడగండ్ల దాటికి మామిడి తోటలో కాయలు రాలి నేలపాయలయ్యాయి. అకాల వర్షంతో నో టి కాడికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.