కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ ఏసుప్రభు ప్రార్థన మందిరంలో మంగళవారం సెమీ క్రిస్టమస్ వేడుకల్లో జబర్దస్త్ కమెడియన్ బాబు సందడి చేశారు. బాబు రాకతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అభిమానులతో సెల్ఫీలు దిగి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, హైదరాబాద్ పాస్టర్ అబ్రహం, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ప్రమోద్ ఉన్నారు.