
భార్య మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కన్నుమూసిన భర్త
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన యశోద అనే మహిళ ఇంటి దర్వాజా తగిలి కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. భార్య మరణ వార్తను జీర్ణించుకోలేక ఆమె భర్త హనుమారెడ్డి గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.