వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ జన్మదిన సందర్భంగా మంగళవారం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ కోదాడల సంయుక్త సహకారంతో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, సిబ్బందికి 200 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు, ఇరుకుళ్ల రామకృష్ణకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.