కోదాడ మండలం గుడిబండ లో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, తుమాటి నాగిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు రఫీ లు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సోమపంగు ప్రసాద్, బుల్లెయ్య, రమేష్, పులి తిరుపతి బాబు, ప్రవీణ్, గామయ్య, బిక్షం పాల్గొన్నారు.