భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన భూభారతి రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ వాజిద్ అలీ అన్నారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర బండపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుండి దరఖాస్తుల స్వీకరించారు.