తొగర్రాయిలో బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

76చూసినవారు
తొగర్రాయిలో బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ
కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలోని ప్రాచీన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు గోడ పత్రికను మంగళవారం కోదాడ పిఏసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నాని, దేవాలయ అర్చకులు ముడుంబ విష్ణువర్ధనాచార్యులు విడుదల చేశారు. మార్చి 13 నుండి 18 వరకు జరిగే వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ముడుంబ లక్ష్మనాచార్యులు, రెంటాల పుల్లేశ్వరశర్మ ఉన్నారు.

సంబంధిత పోస్ట్