కోదాడ: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో శనివారం మైలవరపు రామరావు, కళావతిల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనగల రాధాక్రిష్ణ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, స్టాఫ్ కి అల్పాహారం పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండ్లి రోజును అనాథ పిల్లల మధ్య చేసుకోవటం అభినందనీయం అని, ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రామరావు, కళావతి లకు అభినందనలు తెలియజేసారు.