కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఎలాంటి ఉపయోగకరంగా లేదని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సోమ వారం ఒక ప్రకటన లో విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించి కార్పొరేట్లకు లక్ష కోట్ల రూపాయల రాయితీ ఇవ్వటం బాధాకరం అన్నారు.