బుల్లెల్ వాహనాలతో కోదాడ పట్టణం లో శబ్ద కాలుష్యం చేస్తున్న యువకుల బుల్లెట్ వాహనాల సైలెన్సర్ల ను కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యం లో శని వారం రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిభందనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. యువకుల్లో పరివర్తన తెచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్య క్రమంలో సిఐ శివశంకర్, ఎస్ ఐ లు ఉన్నారు.