సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మోతే మండలం టాపర్ గా నిలిచిన తుమ్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉబ్బపెల్లి. బవ్యశ్రీ ని జిల్లా కలెక్టర్ మెమెంటో ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. నాగేశ్వరరెడ్డి , విద్యార్థిని తండ్రి మదుసూదన్, ఉపాధ్యాయుడు కృష్ణా రెడ్డి ఉన్నారు.