ప్రజలకు జవాబు దారి తనంగా ఉండాల్సిన అధికారులు జర్నలిస్టులపై మాటల దాడికి దిగడం సమంజసం కాదని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. గురువారం ఆయన కోదాడలో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్ కుమార్ జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. జర్నలిస్టులపట్ల దురుసుగా మాట్లాడడం సరికాదని, విద్యాశాఖ అధికారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.