కోదాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో పర్సు పోగొట్టుకున్న మహిళకు ఆ బస్సు కండక్టర్ మల్లారావు పర్సు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ శనివారం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులో మీర్జా కాజమ్మ కోదాడ డిపో బస్సు ఎక్కి నకిరేకల్ దిగింది. ఈ క్రమంలో పర్సు పోగొట్టుకుంది. గమనించిన కండక్టర్ పర్సును భద్రపరిచి కోదాడ డిపోలో బాధితురాలికి అందజేశారు. పర్సులో రూ 4, 780 నగదు విలువైన పత్రాలు ఉన్నాయి.