కోదాడ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన గుండు లక్ష్మణ్ వర్మ గ్రూప్-2 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 29వ ర్యాంక్ సాధించాడు. ఈ సంధర్బంగా వార్డు యూత్ టీమ్ ఆధ్వర్యంలో గురువారం లక్ష్మణ్ వర్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోట మధు, లక్ష్మణ్ వర్మ తల్లదండ్రులు గుండు శ్రీనివాస్ స్వప్న, వార్డు పెద్దలు బరపటి కోటేశ్వరరావు, చందా శ్రీనివాస్, చిత్తలూరి రాజారాం, దొంగరి సుధాకర్, రాజు, శేఖర్ రెడ్డి ఉన్నారు.