రక్తదానం ప్రాణదానంతో సమానమని స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నీల సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అత్యధిక సార్లు రక్తదానం చేసిన షేక్ నజీర్, ఓరుగంటి కిట్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు నీల సత్యనారాయణ, వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులు నరసింహారావు ఉన్నారు.