కోదాడ: వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి

81చూసినవారు
కోదాడ: వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో కోదాడ పశువుల సంతను అభివృద్ధి చేస్తామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏపూరి సుధీర్ తెలిపారు. బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇక నుండి శనివారం, ఆదివారాలతో పాటు ప్రతి గురువారం సంత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు మార్కెట్ యార్డ్ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బషీర్, సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్