భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను కాపుగల్లు సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు ఆయనొక మహా శక్తి అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.