కోదాడ: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

55చూసినవారు
కోదాడ: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజనీ అన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఆధార్ తరహాలోనే రైతులకు పదకొండు అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నగేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్