కోదాడ పట్టణంలోని రామిరెడ్డి పాలెం రోడ్డు లో 100అడుగుల జాతీయ జెండా ప్రదేశం అభివృద్ధి పనులకు శుక్రవారం ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలతో భూమి పూజ నిర్వహించారు. ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు డా. గుండా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు రజనీకాంత్, భగత్, సామినేని రమేష్, నాగార్జున, యూత్వింగ్ వైస్ ప్రెసిడెంట్(అడ్మిన్)సేకు శ్రీనివాస రావు, వెంకన్న, రమేష్, ఉపేందర్ సంధ్యా ఉన్నారు.