కోదాడ: గ్రూప్స్ నియామకాలు నిలిపివేయాలి

51చూసినవారు
కోదాడ: గ్రూప్స్ నియామకాలు నిలిపివేయాలి
గ్రూప్1, గ్రూప్2 , గ్రూప్3 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ను అమలు చేయాలని ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ బుధవారం డిమాండ్ చేశారు. బుధవారం కోదాడ పట్టణం లో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టి మాట్లాడారు. వర్గీకరణ చట్టరూపం దాల్చేవరకు నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ, కొండపల్లి ఆంజనేయులు, ఎల్ శ్రీను, సత్యరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్