చేనేత వస్త్రాలను, హస్త కళారూపాలను ఆదరించి కార్మికులను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్ చౌదరి, వినోద్ కుమార్, గురుమూర్తి, పబ్బా గీత, జగనీ ప్రసాద్, శ్రీనివాసరావు, ఆగిర్ మధు, భరత్, అశోక్, సైదారావు, లోకేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు.