కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన పులి నాగరాజు శుక్రవారం ఫంక్షన్లో వంట చేయడానికి వెళ్లి సోమవారం వరకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు లోకల్ న్యూస్ విలేకరుల్ని ఆశ్రయించడంతో "నాన్న ఎక్కడ ఉన్నా ఇంటికి తిరిగి రా" కథనం ప్రచురితమైంది. దీంతో ఈ కథనానికి భారీ స్పందన లభించింది. సోమవారం రాత్రి క్షేమంగా నాగరాజు ఇంటికి తిరిగి వచ్చారని నాగరాజు తల్లిదండ్రులు కోటయ్య -వెంకమ్మ తెలిపారు. దీంతో నాగరాజు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.