హద్దు మీరి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా హైవే మీద స్టంట్స్, రిల్స్ చేస్తే తాట తీస్తామని కోదాడ పట్టణ సీఐ శివ శంకర్ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం స్టంట్స్, రిల్స్ చేస్తున్న కొంతమంది యువకులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులను ప్రజలను భయపెట్టేలా స్టంట్ లతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. మరోసారి ఇటువంటివి ఘటనలు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.