అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ మునగాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ మండల నాయకులు కంది బండ సత్యనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో పూర్తి విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేశారు.