మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటయ్య, మండల ఉపాధ్యక్షులు సామేలు, గ్రామశాఖ అధ్యక్షులు ఈదారావు, నాయకులు సైదిరెడ్డి, పాషా, కిరణ్ పాల్గొన్నారు.