
త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు
AP: పింఛన్ దారులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఇందుకోసం సులభంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనర్హుల ఏరివేత చేపట్టిందన్నారు.