దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్ తో కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతాయి అన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని కక్షలు, పట్టింపులకు పోయి కక్షి దారులు నష్ట పోవద్దని సూచించారు.