చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన మామిడి నరేష్ హైదరాబాద్ లో జరిగిన సిటీ కప్ క్రికెట్ లో అత్యద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షీల్డ్ పొందాడు. ఫైనల్ మ్యాచ్ లో సికింద్రాబాద్ మీద 20 బంతుల్లో 52 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 2 ఓవర్స్ లో 4 వికెట్ లు సాధించి ఆల్ రౌండర్ గా రాణించాడు. నరేష్ క్రికెట్ లో రాణిస్తుండం పట్ల గ్రామస్తులు ఆనందో త్సవాలు వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.