
BREAKING: అగ్ని ప్రమాదం.. 16కు చేరిన మృతుల సంఖ్య
TG: నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో నిద్రలో ఉన్న వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.