సూర్యాపేట లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ జెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డిపోకు మొత్తం 79 బస్సులు మంజూరు కాగా, 45 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలు బస్ పాస్ చూపించి ఉచితంగా ప్రయాణించ వచ్చారు.