ముగ్గుల పోటీలు మహిళల్లో ప్రతిభ ను వెలికి తీసేందుకు దోహదపడతాయని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. గురువారం రాత్రి కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో జయవరపు పరమేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, గ్రంథాలయ చైర్మన్ రామారావు, నిర్వాహకులు నరేందర్ ఉన్నారు.