మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండాలో నబానోతు భారతి అలియాస్ లాస్య (32), తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు క్షుద్ర పూజకు తన ఏడు నెలల వయస్సు గల తన కూతురును దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసింది. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి డా శ్యామాశ్రీ నిందితురాలైన భారతికి ఉరి శిక్ష విదిస్తూ శుక్రవారం తీర్పును ఇవ్వటం జరిగింది.