విద్యార్థుల నమోదు కార్యక్రమం బడి బాటలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అనంతగిరి మండలం శాంతినగర్ కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం అన్నారు. శుక్రవారం శాంతినగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.