
నేడు ఒంగోలు రూరల్ పీఎస్‌కు దర్శకుడు ఆర్జీవీ
AP: దర్శకుడు రామ్ గోపాల్ వర్మను శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించనున్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన రాలేదు. ఫిబ్రవరి 4న మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈ నెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు.