

విషం తాగిన కుటుంబం.. ముగ్గురు పిల్లలు మృతి (వీడియో)
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. శాంతినగర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు విషం తాగగా.. ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు వర్షా బైరాగి (11), దీప్తి బైరాగి (7), దేవ్‌రాజ్ బైరాగి (5)గా గుర్తించారు. భార్యభర్తలు తరచూ గొడవ పడేవారని, ఈ క్రమంలో విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.