సమాజ సేవకులు ఆర్యవైశ్యులని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం కొనియాడారు. ఆదివారం కోదాడలో నూతనంగా ఎన్నికైన సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె మాట్లాడారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రామారావు, జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.