
పల్నాడులో ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లు, బీర్ సీసాలతో దాడులు
AP: పల్నాడు జిల్లాలోని వడ్డెర బజారులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పాత కక్షలతో దాడులు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇరువర్గాలు కర్రలు, రాళ్లు, బీర్ సీసాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో మళ్ళీ గొడవలు జరగకుండా పోలీసులు బలగాలను భారీగా మోహరించారు.