

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడి (వీడియో)
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులకు పాల్పడింది. నగరవ్యాప్తంగా పలు చోట్ల విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. దీంతో పేలుళ్ల శబ్దం విని స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా దాడులకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.