
జగన్ పుట్టినప్పుడే గొంతు నొక్కేయాల్సింది: కాంగ్రెస్ ఎంపీ
AP: వైసీపీ అధినేత జగన్పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చర్చలో ఆమె మాట్లాడుతూ.. ‘వీడు పుట్టిందే దౌర్భాగ్యం. పుట్టినప్పుడే విజయమ్మ వాడి గొంతు నొక్కేసి ఉంటే పీడ పోయిండేది.’ అని అన్నారు. దాంతో వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అమరావతిపై చర్చలో ఓ జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యల పేరుతో కొమ్మినేనిని అరెస్ట్ చేశారని, మరి టీవీ5 మూర్తి, రేణు చౌదరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.