కోదాడ కు చెందిన సూక్ష్మ కళాకారుడు శనివారం భగవాన్ శ్రీ హనుమాన్ బ్రహ్మోత్సవం సందర్భంగా పెన్సిల్ మొన పై హనుమంతుని విగ్రహాన్ని చెక్కి తన భక్తి భావాన్ని కళా రూపంలో చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు పప్పు, బియ్యం గింజలు, పెన్సిల్ మొన, ఆకులపై సినీ, రాజకీయ ప్రముఖుల, దేవుళ్ళ ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో మరింత రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.