కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని శనగపప్పు గింజపై అంబేడ్కర్ చిత్రాన్ని చెక్కి తన కళాత్మకతతో నివాళులు చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు పెన్సిల్ మొన, బియ్యపు గింజ ల పై సినీ కళాకారుల, దేవుళ్ళ ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. చారి కళాత్మకతను పలువురు అభినందించారు.