కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై చేగువేరా ప్రతిమను చెక్కి ఆయన పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యం, పప్పు, చింత గింజలు, పెన్సిల్ మొన, ఆకులపై సినీ , రాజకీయ ప్రతినిధుల, దేవుళ్ళ చిత్రాలను చెక్కి పలువురి మన్నలను పొందాడు.