కోదాడ: ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

545చూసినవారు
కోదాడ: ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
కోదాడలోతెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ సమావేశం స్థానిక తేజ స్కూల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విద్యా ప్రమాణాల పెంపు లో ప్రైవేట్ టీచర్లు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరసింహారావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్